layoffs: ఆగస్టులో 27 వేల మందిని తొలగించిన టెక్ కంపెనీలు

by Harish |
layoffs: ఆగస్టులో 27 వేల మందిని తొలగించిన టెక్ కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ కంపెనీలు తమ ఖర్చు తగ్గింపులు చేసుకోవడానికి భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఆగస్టు నెలలో కంపెనీలు దాదాపు 27 వేల మందికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. ముఖ్యంగా Intel, IBM, Cisco వంటి పెద్ద కంపెనీలతో పాటు అనేక చిన్న స్టార్టప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 40 కంపెనీలు ఒక్క నెలలోనే ఇన్ని లేఆఫ్‌లు చేపట్టడం గమనార్హం. అదే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపు 422 కంపెనీలు 1,36,000 కంటే ఎక్కువ మంది టెక్ ఉద్యోగులను తొలగించాయి, ఇది రంగంలో గణనీయమైన ఒత్తిడిని సూచిస్తుంది.

కంప్యూటర్‌ చిప్‌లు తయారుచేసే ఇంటెల్ సంస్థ15,000 ఉద్యోగాలను తొలగించింది. ఇది దాని శ్రామిక శక్తిలో 15% పైగా సమానం. ఈ తొలగింపులు 2025 నాటికి $10 బిలియన్ల ఖర్చు తగ్గింపు ప్రణాళికలో భాగం. AI, సైబర్‌సెక్యూరిటీ వంటి అభివృద్ధి రంగాలపై దృష్టి సారించిన సిస్కో సిస్టమ్స్ దాదాపు 6,000 మంది ఉద్యోగులను లేదా దాని గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 7% మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

IBM చైనాలో తన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించుకుంది, దీంతో 1,000 మందికి పైగా తొలగింపులు చేసింది. జర్మన్ చిప్‌మేకర్ అయిన ఇన్ఫినియన్ 1,400 ఉద్యోగాలను, యాక్షన్ కెమెరా తయారీదారు GoPro, దాని సిబ్బందిలో 15% మందిని మొత్తం 140 మంది ఉద్యోగులను తగ్గించుకుంటుంది. ఈ తొలగింపులతో 2024 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన ఖర్చుల నుండి నిర్వహణ ఖర్చులను $50 మిలియన్లకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Next Story