TCS: సీనియర్ ఉద్యోగులకు టీసీఎస్ బిగ్ షాక్.. బోనస్‌లో కోత..!

by Maddikunta Saikiran |
TCS: సీనియర్ ఉద్యోగులకు టీసీఎస్ బిగ్ షాక్.. బోనస్‌లో కోత..!
X

దిశ, వెబ్ డెస్క్: దేశీయ ఐటీ సేవల దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) కంపెనీలోని సీనియర్ ఉద్యోగులకు షాకిచ్చింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా సీనియర్ లెవెల్ ఎంప్లాయిస్(Senior Level Employees)కు అందించనున్న బోనస్‌లో 20 శాతం నుంచి 40 శాతం వరకు కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. మొదటి త్రైమాసికంలో దాదాపు 70 శాతం దాకా వేరియబుల్ పే(Variable pay)ప్రకటించిన ఆ సంస్థ, ఈ త్రైమాసికంలో కోత పెట్టడం విశేషం. జులై-సెప్టెంబర్ మధ్యకాలంలో జూనియర్ లెవెల్ ఉద్యోగులకు 70-100 పర్సెంట్ వరకు వేరియబుల్ అలవెన్సులు ఇవ్వగా .. సీనియర్ ఉద్యోగులకు 20-40 శాతం, మరికొందరికి 100 శాతం ఇందులో కోత వేశారని తెలుస్తోంది. పలు బిజినెస్ యూనిట్లలో పని చేస్తున్న ఎంప్లాయిస్ పనితీరు ఆధారంగా ఈ కోత విధించినట్లు సంస్థ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా కంపెనీ రూల్స్ ప్రకారం ఆఫీస్ నుంచి పని చేసే వారికే సంస్థ వేరియబుల్ అలవెన్సులు ఇస్తోంది. దీంతో కార్యాలయానికి వచ్చి పని చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తమ ఎంప్లాయిస్ లో 70 శాతం మంది ఆఫీస్ నుంచి పని చేస్తున్నారని సంస్థ గత జులైలోనే ప్రకటించింది. కాగా రతన్ టాటా(Ratan Tata) మృతి తర్వాత టెక్కీలకు ఇలా జరగడం నిజంగా షాకింగ్ విషయం అనే చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed