- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TCS ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. త్వరలో జీతాల పెంపు!
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపులు చేపట్టడంతో పాటు, జీతాల పెంపును వాయిదా వేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ మాత్రం తన ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతుంది. కంపెనీలో పనిచేసే ఆఫ్‌సైట్ ఉద్యోగులకు 7-8 శాతం, ఆన్‌సైట్ ఉద్యోగులకు 2-4 శాతం జీతాలను పెంచుతుందని ప్రముఖ మీడియా నివేదిక నివేదించింది. అదే సమయంలో అధిక పనితీరు కలిగి ఉన్నవారికి 12-15 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. జీతాల పెంపుకు సంబంధించిన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. పెరిగిన ఈ కొత్త జీతాలు ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి రావచ్చని సమాచారం.
ఉన్నత స్థాయిలో ఉన్నవారి పదోన్నతులు, ఖర్చు ఆందోళనలు పరిశీలనలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇంతకుముందు 2023 లో మంచి పనితీరును కనబరిచిన ఉద్యోగులకు టీసీఎస్ 12-15 శాతం మేర వేతన పెంపును ఇచ్చింది. డిసెంబర్ 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.11,058 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.10,846 కోట్లతో పోలిస్తే ఇది 2 శాతం పెరిగింది. టీసీఎస్‌లో 2023 డిసెంబర్ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,03,305గా ఉంది.