- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TCSకు రానున్న వన్నీ మంచి రోజులే: సీఈఓ రాజేష్ గోపీనాథన్!
న్యూఢిల్లీ: దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ సీఈఓ, ఎండీగా ఈ నెలాఖరున బాధ్యతల నుంచి తప్పుకోనున్న రాజేష్ గోపీనాథన్ మంగళవారం ఉద్యోగులకు భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పంపారు. ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు చెప్పిన ఆయన, ఈ వారం టీసీఎస్‌తో రెండు దశాబ్దాల సుధీర్ఘ ప్రయాణం ముగిసింది. గడిచిన ఆరేళ్ల కాలంలో కంపెనీకి నాయకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను, ఈ సమయంలోనే సంస్థ అభివృద్ధితో పాటు అనేక మార్పులను చూశామని ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో రాజేష్ గోపీనాథన్ అన్నారు.
ఇప్పటి వరకు సాధించిన దానికంటే భవిష్యత్తులో కంపెనీ మరిన్ని మంచి రోజులను చూడనుందని, మరింత సమర్థవంతంగా సంస్థ వృద్ధి సాధిస్తుందని ఆయన తెలిపారు. రూ. 4 లక్షల కోట్లకు పైగా విలువైన కంపెనీ బాధ్యతలను కృతివాసన్‌ను స్వాగతిస్తున్నానని రాజేష్ గోపీనాథన్ అన్నారు. కంపెనీ ఉద్యోగులు కంపెనీ ఆర్థిక పనితీరును ఉత్తమ స్థాయిలో నిలబెట్టారని, సమర్థవంతమైన నిర్వహణ, ఇన్నోవేషన్, లాభదాయకతపై దృష్టి పెట్టడం వల్ల టీసీఎస్ ఆదాయం పెరిగేందుకు దోహదపడిందని పేర్కొన్నారు.