Tata Power-NIA: టాటా పవర్-నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మధ్య విద్యుత్ ఒప్పందం

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-07 13:30:09.0  )
Tata Power-NIA: టాటా పవర్-నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మధ్య విద్యుత్ ఒప్పందం
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ(Integrated Power Company)లలో ఒకటైన టాటా పవర్(Tata Power) నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం(NIA)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. పునరుత్పాదక ఇంధన(Renewable Energy) అనుసంధానం కోసం టాటా పవర్ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రెసిడెంట్ సంజయ్ బంగా(Sanjay Banga) సమక్షంలో ఎన్ఐఏతో 25 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నట్లు టాటా పవర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ భాగస్వామ్యం విలువ దాదాపు రూ. 550 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో 10.8 మెగావాట్ల పవన విద్యుత్(Wind Power) సరఫరా, ఆన్‌సైట్ సోలార్ పవర్ ప్లాంట్(Onsite Solar Power Plant) డెవలప్‌మెంట్ వంటివి ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 25 ఏళ్ల పాటు టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్(TPREL).. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు 10.8 మెగావాట్ల పవన విద్యుత్ సరఫరా చేయనుంది. దీంతో పాటు 13 మెగావాట్ల ఆన్‌సైట్ సోలార్ పవర్ ప్లాంట్ ను అభివృద్ధి చేసి నిర్వహించనుంది.

Advertisement

Next Story