అయోధ్య పరిసరాల్లో ఈవీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన టాటా పవర్

by Harish |
అయోధ్య పరిసరాల్లో ఈవీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన టాటా పవర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఈవీల కోసం చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన అయోధ్య రామమందిరం చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఈవీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడానికి పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో రామమందిరానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో తాజాగా టాటా పవర్ కంపెనీ అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ (ఏడీఏ)తో కలిసి రామమందిరానికి వెళ్లే కీలక మార్గాల్లో చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసింది.

వీటిని జాతీయ రహదారి (NH) 27 ద్వారా అయోధ్య నుండి లక్నో, NH 330 ద్వారా అయోధ్య నుండి రాయబరేలీ, NH 330 ద్వారా గా అయోధ్య నుండి ప్రయాగ్‌రాజ్, H 27 మీదుగా అయోధ్య నుండి గోరఖ్‌పూర్ మార్గాల్లో ఏర్పాటు చేసినట్లు టాటా పవర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్టేషన్లు పర్యావరణ సారథ్యానికి ఉపయోగపడుతాయి. దేశాన్ని నికర జీరో ఉద్గారాల వైపు తీసుకెళ్లడాన్ని వేగవంతం చేస్తాయని టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ దీపేష్ నందా అన్నారు.

80,000 కంటే ఎక్కువ హోమ్ ఛార్జర్‌లు, 5,300 కంటే ఎక్కువ పబ్లిక్, సెమీ పబ్లిక్, ఫ్లీట్ ఛార్జింగ్ పాయింట్‌లు, 850 కంటే ఎక్కువ బస్ ఛార్జింగ్ స్టేషన్‌లతో పర్యావరణ అనుకూల రవాణాను ముందుకు తీసుకెళ్లడానికి టాటా పవర్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని కంపెనీ పేర్కొంది. అయోధ్య కమిషనర్ గౌరవ్ దయాల్ మాట్లాడుతూ, ఈ చార్జింగ్ పాయింట్లు నగర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా, పర్యావరణ అనుకూల రవాణాకు కొత్త ఉత్తేజాన్ని అందిస్తాయని అన్నారు.

Advertisement

Next Story