టాటా మోటార్స్, ఉబెర్ మధ్య అతిపెద్ద ఈవీ ఒప్పందం!

by Harish |
టాటా మోటార్స్, ఉబెర్ మధ్య అతిపెద్ద ఈవీ ఒప్పందం!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈవీ రంగంలోనే భారీ ఒప్పందాన్ని ప్రకటించింది. రైడింగ్ ప్లాట్‌ఫామ్ ఉబెర్‌కు టాటా సంస్థ ఏకంగా 25,000 ఎక్స్‌ప్రెస్-టీ ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ను సరఫరా చేసేందుకు అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ కార్లను ఉబెర్ కంపెనీ తన ప్రీమియం విభాగం సేవలకు వినియోగించనున్నట్లు సోమవారం ప్రకటనలో వెల్లడించింది. వీటన్నింటిని హైదరాబాద్ సహా ఢిల్లె-ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌లలో వినియోగించనున్నారు.

ఈ నెల నుంచే కార్లను ఉబెర్‌కు సరఫరా చేస్తామని, దేశీయంగా ఈవీల వాడకాన్ని పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం ఎండీ శైలేష్ చంద్ర అన్నారు. ఈ భాగస్వామ్యంతో ఈవీ పరిశ్రమ మరింత పటిష్టంగా మారడంతో పాటు సున్నా ఉద్గారాల లక్ష్యాలను చేరేందుకు వీలవుతుందని ఉబెర్ ఇండియా అధ్యక్షుడు ప్రబ్‌జీత్ సింగ్ తెలిపారు. కాగా, ఇరు సంస్థల మధ్య జరిగిన ఈ ఒప్పందం విలువ ఎంతనేది పేర్కొనలేదు.

Advertisement

Next Story

Most Viewed