New EV Policy: కొత్త ఈవీ పాలసీ ఊహాగానాలతో దేశీయ వాహన కంపెనీలపై ఒత్తిడి

by S Gopi |
New EV Policy: కొత్త ఈవీ పాలసీ ఊహాగానాలతో దేశీయ వాహన కంపెనీలపై ఒత్తిడి
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈవీ మార్కెట్లోకి ప్రపంచ బిలీయనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన కార్ల బ్రాండ్ టెస్లా త్వరలో అడుగుపెట్టడం దాదాపుగా ఖరారైంది. ఈ నేపథ్యంలో మొదటినుంచి అధిక పన్నులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టెస్లా కోసం మరింత సుంకాలను తగ్గించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సంబంధిత సుంకాల పెంపు ప్రకటనల నేపథ్యంలో భారత ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీని మరింత సరళతరం చేయనుందనే కథనాలు వెలువడ్డాయి. దీంతో దేశీయ బ్రాండ్లు టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, హ్యూండాయ్ లాంటి కంపెనీలు ఒత్తిడి గురవుతున్నాయి. శుక్రవారం ఈ కంపెనీలు షేర్లు ఏకంగా 6 శాతం మేర పతనం అయ్యాయి. ప్రభుత్వం ఈవీ వాహనాల దిగుమతుల నిబంధనల భారం తగ్గిస్తుందని, విదేశీ కంపెనీల ఎంట్రీని సులభతరం చేస్తుందని నివేదికలు వెలువడ్డాయి. దీనివల్ల దేశీయంగా పోటీ మరింత తీవ్రతరం అవుతాయనే అంచనాలు పెరిగాయి. ప్రస్తుతానికి టెస్లా మన మార్కెట్లలో అమ్మకాలను ప్రారంభించనుంది. త్వరలో స్థానికంగానే తయారీని కూడా మొదలుపెట్టనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Next Story