వాణిజ్య వాహనాల ధరలను 2% పెంచిన టాటా మోటార్స్

by Harish |
వాణిజ్య వాహనాల ధరలను 2% పెంచిన టాటా మోటార్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తన వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు పేర్కొంది. పెరిగిన ఈ ధరలు ఏప్రిల్ 1, 2024 నుండి అమల్లోకి వస్తాయి. వాణిజ్య వాహనాల విభాగంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి టాటా మోటార్స్ పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులను భర్తీ చేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ధరల పెరుగుదల మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుంది. మొత్తం వాణిజ్య వాహనాల శ్రేణి ధరలను పెంచినప్పటికి ప్యాసింజర్ వాహనాల ధరలు మాత్రం యథావిధిగా ఉంటాయని అధికారులు తెలిపారు. వాణిజ్య వాహనాల అనగా ట్రక్కులు మొదలగునవి.

టాటా మోటార్స్ ప్రస్తుతం, గ్లోబల్, ఇండియన్ మార్కెట్‌లో పలు వాణిజ్య వాహనాల మోడల్స్‌ను విక్రయిస్తుంది. ఇటీవల కంపెనీని రెండు యూనిట్లుగా విడదీయడాన్ని బోర్డు ఆమోదించిందని అధికారులు పేర్కొన్నారు. విభజన తర్వాత, ఒక కంపెనీ ప్యాసింజర్,ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు జాగ్వార్ ల్యాండ్ రోవర్ వ్యాపారాలు, సంబంధిత పెట్టుబడులను కలిగి ఉంటుంది. వాణిజ్య వాహన వ్యాపారం, సంబంధిత పెట్టుబడులు మరో సంస్థలోకి మార్చబడతాయి.

Advertisement

Next Story

Most Viewed