- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Swiggy: ఐపీఓ తర్వాత కోటీశ్వరులైన 500 మంది స్విగ్గీ ఉద్యోగులు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ బుధవారం భారత స్టాక్ మార్కెట్లలో అడుగుపెట్టింది. లిస్టింగ్ తొలిరోజే కంపెనీ షేర్లు ఐపీఓ ధర కంటే 8 శాతం ప్రీమియంతో రూ. 420 వద్ద ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఐపీఓ సందర్భంగా స్విగ్గీ తన ఉద్యోగులకు ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్ ద్వారా అర్హులైన వారికి షేర్లు కేటాయించింది. దీంతో షేర్లు ఉన్న వారిలో 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు రూ. 420 వద్ద లిస్టింగ్ కావడంతో ఒక్కో ఉద్యోగి పెట్టుబడుల విలువ రూ. 2 కోట్లకు చేరుకున్నాయని తెలుస్తోంది. మొత్తం 5,000 మంది ఉద్యోగులకు షేర్లు కేటాయించగా వాటి విలువ రూ. 9,046.65 కోట్లకు చేరాయి. స్విగ్గీ ఐపీఓ మొత్తంలో రూ. 4,499 కోట్లు కొత్త షేర్ల ద్వారా, రూ. 6,828 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కంపెనీ సమీకరించింది. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మొదలైన రెండు రోజులు పెద్దగా స్పందన లేనప్పటికీ, చివరి రోజు భారీ స్పందన కనిపించింది. రూ.11,327 కోట్ల నిధులు సేకరించినేందుకు ఐపీఓకు వచ్చిన కంపెనీకి మొత్తం 3.599 రెట్ల సబ్‌స్క్రిప్షన్ లభించింది.