భారత్ 8% వృద్ధి అంచనా మాది కాదు: IMF అధికార ప్రతినిధి

by Harish |
భారత్ 8% వృద్ధి అంచనా మాది కాదు: IMF అధికార ప్రతినిధి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల భారత వృద్ధి గురించి అంతర్జాతీయ ద్రవ్య నిధిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలకు IMF అంచనా వేసిన వృద్ధికి చాలా తేడా ఉందని, ఇది ఆయన అభిప్రాయం అని IMF అధికార ప్రతినిధి జూలీ కొజాక్ వాషింగ్టన్‌లో ఒక మీడియా సమావేశంలో అన్నారు. సుబ్రమణియన్ భారత్‌కు ఎనిమిది శాతం వృద్ధి అంచనా వేశారు. అయితే ఈ వ్యాఖ్యలు IMF అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించడం లేదని, ఆయన పేర్కొన్న వృద్ధి IMFలో భారతదేశ ప్రతినిధిగా తన అభిప్రాయాలు మాత్రమే వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనా వేసిన వృద్ధికి ఆయన పేర్కొన్న దానికి చాలా తేడాలు ఉన్నాయని ఆమె అన్నారు.

సమావేశంలో ఒక విలేకరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి భారత్ 8 శాతం వృద్ధి రేటును అంచనా వేశారు, అయితే ఇది గతంలో IMF అంచనా వేసిన దానికంటే చాలా భిన్నంగా ఉందని ప్రశ్నించగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మాకు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఉంది. దానిలో వివిధ దేశాల సమూహాల ప్రతినిధులు అయిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు ఉంటారు. అందరూ విడిగా తమ అభిప్రాయాలను కలిగి ఉంటారని అధికార ప్రతినిధి అన్నారు.

మార్చి 28న న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సుబ్రమణియన్ మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా దేశం అమలు చేసిన మంచి విధానాలను రెట్టింపు చేసి, సంస్కరణలను వేగవంతం చేస్తే, 2047 వరకు భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధి చెందుతుందని అన్నారు. అయితే ఈ వృద్ధి అంచనా IMF గతంలో పేర్కొన్న దానితో పోలిస్తే భిన్నంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed