వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో సూచీలు!

by Harish |   ( Updated:2023-03-14 13:46:10.0  )
వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లను నష్టాలు వెంటాడుతున్నాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభ ప్రభావం కొనసాగుతున్నందున గ్లోబల్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఆ ప్రభావం మన సూచీలపై కూడా కొనసాగడంతో వరుసగా నాలుగవరోజు నష్టపోయాయి. దాంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఐదు నెలల కనిష్ఠానికి దిగజారాయి. మంగళవారం ఉదయం లాభాలతో మొదలైన సూచీలు కొద్దిసేపటికి పతనమయ్యాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలు పెరిగాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 337.66 పాయింట్లు దెబ్బతిని 57,900 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 17,043 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, ఫార్మా రంగాలు మాత్రమే అత్యల్పంగా పుంజుకోగా, మిగిలిన రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి.

ఎంఅండ్ఎం, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.52 వద్ద ఉంది.

Also Read..

మళ్లీ పెరుగుతున్న బంగారంపై పెట్టుబడులు!

Advertisement

Next Story