Stock markets: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by Maddikunta Saikiran |
Stock markets: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock markets) వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత ఆరు రోజులుగా నష్టాల్లో ముగుస్తూ వచ్చిన సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ఉదయం నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు చివరకు లాభాల్లోకి దూసుకెళ్లాయి.హర్యానా(Haryana), జమ్మూ కశ్మీర్‌(Jammu Kashmir) ఎన్నికల ఫలితాల(Election Results) నేపథ్యంలో మార్కెట్లు ప్రారంభంలో ఒడిదొడుకులను ఎదుర్కొన్న చివరకు హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో దేశీయ సూచీలు తిరిగి లాభాల బాటపట్టాయి. మార్కెట్లు ముగిసే సరికి సెన్సెక్స్‌(Sensex) 584.81 పాయింట్లు లాభపడి 81,634 వద్ద స్థిరపడగా, నిఫ్టీ(Nifty) 217.40 పాయింట్ల లాభంతో 25,013 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79.33 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.96గా ఉంది.

లాభాలో ముగిసిన షేర్లు : అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎంఅండ్‌ఎం,రిలయన్స్,హెచ్‌డీఎఫ్‌సీ

నష్టపోయిన షేర్లు : టాటా స్టీల్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్,బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్ , జెడబ్ల్యూ స్టీల్,

Advertisement

Next Story

Most Viewed