- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 720 పాయింట్లు ఢమాల్
దిశ,వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ స్టాక్ మార్కెట్లు(Stock Market) వారాంతాన్ని భారీ నష్టాలతో ముగించాయి. ఈ ఇయర్ తొలి రెండు రోజులు లాభాల్లో కొనసాగిన సూచీలు ఈ రోజు మళ్లీ నష్టాల బాట పట్టాయి. ముఖ్యంగా ఈ రోజు బ్యాంకింగ్(Banking) షేర్లలో అమ్మకాలు మన బెంచ్ మార్క్ సూచీలను పడేశాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 80,072.99 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమై కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 79,109.73 వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 720.60 పాయింట్లు క్షీణించి 79,223.11 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 207.25 పాయింట్లు తగ్గి 23,981.40 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75.61 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. అమెరికన్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.78 వద్ద ముగిసింది.
లాభాల్లో ముగిసిన షేర్లు: టాటా మోటార్స్, టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, రిలయన్స్
నష్టాల్లో ముగిసిన షేర్లు: అదానీ పోర్ట్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, జొమాటో, HDFC బ్యాంక్