మే 20 నుంచి స్పెక్ట్రమ్ వేలం: టెలికాం విభాగం

by S Gopi |
మే 20 నుంచి స్పెక్ట్రమ్ వేలం: టెలికాం విభాగం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది మే 20 నుంచి స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నట్టు టెలికాం విభాగం వెల్లడించింది. దీనికి సంబంధించి టెలికాం కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చని శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 800మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్, 1800మెగాహెర్ట్జ్, 2100మెగాహెర్ట్జ్, 2300మెగాహెర్ట్జ్, 2500మెగాహెర్ట్జ్, 3300మెగాహెర్ట్జ్, 26గిగాహెర్ట్జ్ బ్యాండ్‌ల కోశం ఈ వేలం అందుబాటులో ఉండనుంది. అన్ని స్పెక్ట్రమ్‌లను రూ. 96,317.65 కోట్ల బేస్ ధరకు వేలానికి ఉంచనున్నట్టు పేర్కొంది. ఈ వేలం ప్రధానంగా టెలికాం కంపెనీలు ప్రస్తుతం నిర్వహిస్తున్న వాటి గడువు ముగుస్తున్న కారణంగా కొనుగోలు చేయనున్నాయి. కొన్ని సర్కిళ్లలో తమ లైసెన్స్‌లను రెన్యూవల్ చేయాల్సి ఉన్నందున ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు కొనుగోలు చేయవచ్చని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో మాట్లాడిన టెలికాం కారదర్శి నీరజ్ మిట్టల్ మాట్లాడుతూ.. టెలికాం స్పెక్ట్రమ్‌పై కంపెనీలు ఈ ఏడాది పెద్దగా ఖర్చు చేయకపోవచ్చు. 2022లో జరిగిన వేలంలో కంపెనీలు పెద్ద ఎత్తున స్పెక్ట్రమ్ కోసం ఖర్చు చేయడమే ఇందుకు కారణం. గడువు ముగిసే వాటికి టాప్-అప్ కోసం ఈ వేలంలో పాల్గొంటాయని వెల్లడించారు.

Advertisement

Next Story