Bangladesh: బంగ్లాదేశ్ పరిస్థితులతో వస్త్ర రంగంపై కొంత ప్రభావం: నిర్మలా సీతారామన్

by Harish |
Bangladesh: బంగ్లాదేశ్ పరిస్థితులతో వస్త్ర రంగంపై కొంత ప్రభావం: నిర్మలా సీతారామన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో ఇటీవల నెలకొన్న పరిస్థితులతో అక్కడ టెక్స్‌టైల్ గార్మెంట్ రంగంలో పెట్టుబడి పెట్టిన భారత కంపెనీలు కొంత కాలం ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అన్నారు. బంగ్లాదేశ‌లో ప్రధానంగా వస్త్ర, అల్లిన బట్టల రంగాల పరిశ్రమలు పెద్ద ఎత్తున్న ఉన్నాయి. వీటిలో భారత్‌కు చెందిన వ్యాపారవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా వాటిలో చాలా వరకు తమిళనాడుకు చెందినవి ఉన్నాయి.

అయితే బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో అక్కడ వ్యాపార రంగం చాలా వరకు దెబ్బతింది. వస్త్ర ఎగుమతులు చాలా వరకు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ తాజాగా ఆ దేశంలో పెట్టుబడులు పెట్టిన టెక్స్‌టైల్ గార్మెంట్ ప్రతినిధులతో ప్రస్తుత వ్యాపార పరిస్థితులపై చర్చలు జరిపారు. అక్కడ జరుగుతున్న ఆందోళనల కారణంగా స్వల్పకాలంలో, బంగ్లాదేశ్‌లోని రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టిన భారతీయ టెక్స్‌టైల్ కంపెనీలు తమ ఉత్పత్తులను కొనసాగించడంలో కొంత సవాళ్లను ఎదుర్కొంటాయని అన్నారు.

భారత్ నుంచి అక్కడికి పెట్టుబడులు చిత్తశుద్ధితో వెళ్లాయి. దీంతో బంగ్లాదేశ్ నుండి ఎగుమతులు పెరిగాయి, తాత్కాలిక ప్రభుత్వం పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని ఆర్థిక మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌కు రెడిమేడ్ గార్మెంట్స్ రంగం అతిపెద్ద ఎగుమతి ఆదాయంగా ఉంది, 2022-23లో బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో 84.6 శాతం రెడీమేడ్ గార్మెంట్స్ ఉన్నాయి.

Advertisement

Next Story