Silver Price : నేడు లక్ష దాటిన వెండి ధర .. ఆల్ టైమ్ హైకి చేరిక.. ఒక్క రోజులోనే ఎంత పెరిగిందో తెలుసా?

by Prasanna |
Silver Price : నేడు లక్ష దాటిన వెండి ధర .. ఆల్ టైమ్ హైకి చేరిక.. ఒక్క రోజులోనే ఎంత పెరిగిందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కానీ వెండి కానీ కొనుగోలు చేస్తుంటాము. అయితే, గత వారం నుంచి ఈ ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇక వెండి కొనాలనుకునే వారికీ ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే భారీగా పెరిగి అందర్ని షాక్ కు గురి చేసింది. ఎంత పెరిగిందో ఇక్కడ చూద్దాం..

ఈ మధ్య కాలంలో వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు ధరలు భారీ నుంచి అతి భారీగా పెరిగాయి. నిన్నటి ధరల మీద పోల్చుకుంటే వెండి ధరలు ఒక్క రోజులోనే రూ. 3000 కు పెరిగి కిలో రూ. 1,01,000 గా ఉంది. ఆల్ టైమ్ హైకి చేరడంతో వినియోగదారులు షాప్ వరకు వెళ్లి కొనకుండా వెనుదిరుగుతున్నారు.

Next Story

Most Viewed