వన్ మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించిన సిద్స్‌ ఫార్మ్‌

by Harish |   ( Updated:2023-01-17 13:56:13.0  )
వన్ మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించిన సిద్స్‌ ఫార్మ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్ట్‌ టు కన్స్యూమర్‌ డెయిరీ బ్రాండ్‌, సిద్స్‌ ఫార్మ్‌ ఒక మిలియన్‌ డాలర్లను బ్రిడ్జ్‌ రౌండ్‌లో తమ వినియోగదారులు, వారి రిఫరెల్స్‌ నుంచి సమీకరించింది. ఇప్పటి వరకు ఆర్గానిక్‌ వృద్ధితో నడపబడుతున్న ఈ బూట్‌ స్ట్రాప్డ్‌ ఎంటర్‌ప్రైజ్‌, తమ సంపన్నులైన వినియోగదారులు, వారి చేత సిఫార్సు చేయబడిన వారి నుంచి మొట్టమొదటిసారిగా ఈ నిధులను సమీకరించింది. బ్రాండ్‌ విశ్వసనీయత, అత్యున్నత నాణ్యత, సాటిలేని వినియోగదారుల అనుభవాలకు ప్రతీకగా ఇది నిలుస్తుంది. కంపెనీ ఈ నిధులను నూతన ఉత్పత్తి అభివృద్ది, మౌలిక వసతుల ఆధునీకరణ, డిజిటల్‌ పరివర్తన అవసరాల కోసం వినియోగించనుంది.

''మేమిప్పటి వరకు బూట్‌ స్ట్రాప్‌ చేశాము. ఇప్పుడు మా వినియోగదారులు ముందుకు రావడంతో పాటుగా మా లక్ష్యం పట్ల నమ్మకంతో మా బ్రాండ్‌లో పెట్టుబడి పెట్టిన వినియోగదారులకు ధన్యవాదములు తెలుపుతున్నాము''అని సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌– మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి అన్నారు.

ఈ రౌండ్‌లో ముఖ్య ఇన్వెస్టర్‌గా నిలిచిన సునీల్‌ కుమార్‌ పొత్తూరి మాట్లాడుతూ ''స్వచ్ఛమైన సంకల్పం, పట్టుదలతో కిశోర్‌ ఈ బ్రాండ్‌ను నాణ్యత, సమయానికి డెలివరీ పరంగా మిగిలిన వాటికి భిన్నంగా ఉంచారు. సాంకేతిక స్వీకరణ పరంగా పూర్తిగా వెనుకబడిన రంగంలో సిద్స్‌ ఫార్మ్‌ విధానం సరళంగా ఉంది. స్వచ్ఛమైన డెయిరీ ఉత్పత్తులను అందించాలనే కిశోర్‌, సిద్స్‌ ఫార్మ్‌తో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉంది'' అని అన్నారు.

మరో అగ్రగామి మదుపరుడు లోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ ''ఆరోగ్యవంతమైన ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుంది. వర్కింగ్‌ క్లాస్‌ ప్రజల ఆరోగ్యం, వెల్‌నెస్‌లో డెయిరీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రీమియం మార్కెట్‌ మరింతగా వృద్ధి చెందగలదని ఆశిస్తున్నాము'' అని అన్నారు.

ఇతర ఇన్వెస్టర్లలో శిల్పాచౌదరి, ప్రవీణ ఈడ్పుగంటి, ఫిరోజ్‌ మొహమ్మద్‌, గౌతమ్‌ కుమార్‌ రెడ్డి, కపిల్‌ గోదానీ, కైరా ఏ దుహ్లానీ, హరేగౌర్‌ నాయక్‌, రవితేజ చండూరు, డాక్టర్‌ అభినవ్‌ గోరుకంటి, ఎన్‌ రామాంజనేయ రెడ్డి, సుధీర్‌ చుక్కపల్లి, వీవీఆర్‌ అభిజీత్‌, హాప్‌గ్రో ప్రైవేట్‌ లిమిటెడ్‌, లేఖ్య ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌ లక్ష్మిఫణి, తవో క్యాపిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వినీత్‌ రాయ్‌ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed