RBI: పెరుగుతున్న ఏఐ వినియోగంపై బ్యాంకులను హెచ్చరించిన ఆర్‌బీఐ గవర్నర్ దాస్

by S Gopi |
RBI: పెరుగుతున్న ఏఐ వినియోగంపై బ్యాంకులను హెచ్చరించిన ఆర్‌బీఐ గవర్నర్ దాస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ)కి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బ్యాంకులను హెచ్చరించారు. వీటివల్ల బ్యాంకులు కొత్త సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో లిక్విడిటీ బఫర్‌ను బలోపేతం చేయాలని సూచించారు. సోమవారం ఆర్‌బీఐ ఎట్90 ఉన్నతస్థాయి సమావేశంలో ప్రసంగించిన దాస్.. ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతున్న ఏఐ వినియోగం బ్యాంకులపై ప్రభావం చూపనుంది. దీన్ని ఎదుర్కొనేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నష్టాలను తగ్గించే చర్యలు తీసుకోవాలి. బ్యాంకులు ఏఐ, బిగ్‌టెక్ ప్రయోజనాలను వాడుకోవాలని, వాటిపై ఆధారపడొద్దన్నారు. ప్రధానంగా సైబర్ దాడులు, డేటా ఉల్లంఘనలను ఏఐ వల్లనే ఏర్పడుతున్నాయి. సవాళ్లను మరింత సమర్థవంతంగా పరిష్కరిస్తూ.. టెక్నాలజీల వల్ల ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదం ఉంటుందని, ఏఐపై ఎక్కువగా ఆధారపడటం అనుకున్న లక్ష్యాలను సాధించడంలో సమస్యలు ఎదురవ్వొచ్చు, ముఖ్యంగా కొత్త టెక్ ప్రొవైడర్లు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో ఇది మరింత రిస్క్‌తో కూడుకున్నదని దాస్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed