తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు

by S Gopi |
తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అంతకుముందు ట్రేడింగ్‌లో నష్టాలను చూసిన సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ, గ్లోబల్ మార్కెట్ల నుంచి లభించిన సానుకూల మద్దతుతో పుంజుకున్న తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారాయి. ప్రధానంగా బ్యాంకింగ్ రంగంలోని షేర్లపై అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్లు బలహీనపడ్డాయి. రోజంతా నష్టాల్లో కదలాడిన అనంతరం చివరి అరగంటలో కొనుగోళ్లను చూడటంతో స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. ఐటీ రంగ షేర్లు సైతం గరిష్ఠాల నుంచి నీరసించినప్పటికీ, ఆ తర్వాత బలపడ్డాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 30.99 పాయింట్లు లాభపడి 71,386 వద్ద, నిఫ్టీ 31.85 పాయింట్ల లాభంతో 21,544 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ, హెల్త్‌కేర్, ఆటో, ఐటీ రంగాలు రాణించగా, మీడియా, బ్యాంకింగ్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ కంపెనీలు లాభాలను సాధించాయి. నెస్లె ఇండియా, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.13 వద్ద ఉంది.

Advertisement

Next Story