600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్!

by Vinod kumar |
600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస రెండు సెషన్ల తర్వాత లాభాలను సాధించాయి. మంగళవారం ట్రేడింగ్‌లో కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం, ఐటీసీ, రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు బ్యాంకింగ్, ఐటీ షేర్లు గణనీయంగా పుంజుకోవడం వంటి పరిణామాలు సూచీలకు కలిసొచ్చాయి. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, ముడి చమురు ధరలు దిగిరావడం, విదేశీ మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడం వంటి అంశాలు దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 600.42 పాయింట్లు పెరిగి 61,032 వద్ద, నిఫ్టీ 158.95 పాయింట్లు లాభపడి 17,929 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ అత్యధికంగా 3.31 శాతం లాభపడింది. కంపెనీలో ప్రభుత్వం తన వాటాను తగ్గించుకోవడం లేదని దీపమ్ కార్యదర్శి ప్రకటనతో ఐటీసీ షేర్ దూసుకెళ్లింది.

దీని తర్వాత రిలయన్స్ 2.35 శాతం పెరగ్గా, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, విప్రో కంపెనీల షేర్లు లాభాలు సాధించాయి. ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, ఆల్ట్రా సిమెంట్, ఎల్అండ్‌టీ, టైటాన్, ఏషియన్ పెయింట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.78 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed