- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నష్టాల నుంచి లాభాల్లోకి మారిన సూచీలు!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస హ్యాట్రిక్ నష్టాల నుంచి లాభాలను సాధించాయి. దేశీయంగా సానుకూల పరిణామాల కారణంగా వారాంతం సూచీలు పుంజుకున్నాయి. శుక్రవారం ఉదయం నష్టాలతో మొదలైన ట్రేడింగ్‌లో మిడ్-సెషన్ తర్వాత వరకు అదే ధోరణిలో కదలాడాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య చివరి గంట వరకు బలహీనంగా సాగిన ర్యాలీ ఆఖరులో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి మారాయి.
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై అదానీ గ్రూపునకు సుప్రీంకోర్టు కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిన వార్తలతో అదానీ షేర్లు ఊపందుకున్నాయి. దానికి తోడు ఐటీ రంగంలో కనిపించిన షేర్ల కొనుగోళ్లతో ఆఖరులో సూచీలకు మద్దతు లభించింది.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 297.94 పాయింట్లు లాభపడి 61,729 వద్ద, నిఫ్టీ 73.45 పాయింట్లు పెరిగి 18,203 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, రియల్టీ, ఆటో రంగాలు రాణించాయి. ఫార్మా రంగంలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్, టైటాన్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, సన్‌ఫార్మా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.72 వద్ద ఉంది.