- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐదు నెలల గరిష్ఠానికి సెన్సెక్స్!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం లాభాల్లో ముగిశాయి. అంతకుముందు సెషన్‌లో నష్టాల్లో ముగిసిన సూచీలు శుక్రవారం ఉదయం ప్రారంభంలో ప్రతికూలంగా ర్యాలీ చేసినప్పటికీ, మిడ్-సెషన్ తర్వాత లాభాలకు మారాయి. రోజంతా అమ్మకాల ఒత్తిడి కారణంగా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన తర్వాత చివర్లో లాభాలను నమోదు చేశాయి. గ్లోబల్ మార్కెట్ల ధోరణి బలహీనంగా ఉన్నప్పటికీ, దేశీయంగా బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లతో సెన్సెక్స్ ఇండెక్స్ ఐదు నెలల గరిష్ఠానికి చేరింది.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 123.38 పాయింట్లు పెరిగి 62,027 వద్ద, నిఫ్టీ 17.80 పాయింట్లు పెరిగి 18,314 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు మెరుగైన లాభాలను సాధించాయి.
పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, అల్ట్రా సిమెంట్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.17 వద్ద ఉంది.