తక్కువ లాభాలతో సరిపెట్టిన సూచీలు!

by Vinod kumar |
తక్కువ లాభాలతో సరిపెట్టిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. గతవారంలో వరుస నష్టాలను ఎదుర్కొన్న సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచే లాభాల్లో ర్యాలీ చేశాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు లేకపోవడంతో ఓ దశలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు మిడ్-సెషన్ తర్వాత స్థిరమైన లాభాలను కొనసాగించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 110.09 పాయింట్లు లాభపడి 64,996 వద్ద, నిఫ్టీ 40.25 పాయింట్లు పెరిగి 19,306 వద్ద ముగిశాయి. నిఫ్టీ రియల్టీ, ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ రంగాలు రాణించాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, మారుతీ సుజుకి, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలను చూశాయి. రిలయన్స్, నెస్లె ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, ఐటీసీ, టాటా మోటార్స్ కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.63 వద్ద ఉంది. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం నేపథ్యంలో కంపెనీ అధినేత ముఖేశ్ అంబానీ కీలక ప్రకటనలు చేశాయి. అయితే, పెట్టుబడిదారులు ఆశించిన స్థాయిలో అవి లేకపోవడంతో కంపెనీ షేర్ 1 శాతానికి పైగా క్షీణించి రూ. 2,442.55 వద్ద ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed