Stock Market: తక్కువ లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
Stock Market: తక్కువ లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. అంతకుముందు సెషన్‌లో అమెరికా మార్కెట్ల మద్దతుతో అధిక లాభాలను చూసిన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ప్రధానంగా మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్‌లో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడ్డాయి. దీనికితోడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించనుందనే అంచనాలతో పెరిగిన మార్కెట్లు నెమ్మదించాయి. వీటికితోడు దేశీయంగా కీలక ఇన్ఫోసిస్, రియలన్స్ సహా బ్లూచిప్ స్టాక్స్‌లో అమ్మకాలు ఒత్తిడి పెంచాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 13.65 పాయింట్లు మాత్రమే లాభపడి 81,711 వద్ద, నిఫ్టీ 7.15 పాయింట్లు పెరిగి 25,017 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, ఫైనాన్స్ రంగాలు రాణించగా, మిగిలిన రంగాలు నెమ్మదించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకి, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు 1 శాతానికి పైగా పుంజుకున్నాయి. టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందూస్తాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, ఐటీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.91 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed