- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌కు రానున్న టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు!
న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వచ్చే వారం భారత ప్రభుత్వ అధికారులను కలవనున్నట్టు తెలుస్తోంది. చైనాకు వెలుపల టెస్లా తయారీని పెంచే ప్రయత్నాల్లో ఉన్న కంపెనీ తన ఈవీలకు సంబంధించి స్థానిక పరికరాల లభ్యత గురించి పలువురు అధికారులతో పాటు ప్రధాన మంత్రి కార్యాలయంలోని ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం కానున్నారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.
భారత్‌లో అధిక దిగుమతి పన్నులు, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన నిబంధనల విషయంలో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ చేస్తున్న ఆరోపణలను తాజా పరిణామాలు చక్కదిద్దుతాయనే అంచనాలున్నాయి. భారత్‌కు రానున్న టెస్లా ప్రతినిధులలో కంపెనీ సరఫరా, ఉత్పత్తి, వ్యాపారాభివృద్ధి విభాగాల నుంచి సీ-సూట్ ఎగ్జిక్యూటివ్‌లు, నిర్వాహకులు ఉండొచ్చని సమాచారం. భారత్‌లో తమ వాహనాలపై దిగుమతి పన్నులను తగ్గించాలని టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కోరనున్నట్టు బ్లూమ్‌బర్గ్ అభిప్రాయపడింది.
గతేడాది రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, టెస్లా తన ఈవీలను భారత్‌లో తయారు చేసేందుకు సిద్ధంగా ఉంటే ఇబ్బందేమీ లేదని, కానీ చైనా నుంచి కార్లను దిగుమతి చేయకూడదని చెప్పిన సంగతి తెలిసిందే. 2021లో టెస్లా కస్టమ్స్ విలువతో సంబంధం లేకుండా ఎలక్ట్రిక్ కార్లపై సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని, ఎలక్ట్రిక్ కార్లపై 10 శాతం సాంఘిక సంక్షేమ సర్‌చార్జిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.