ఎస్‌యూవీలు పెరిగినా తమ సెడాన్ కార్ల గిరాకీ తగ్గలేదు: మెర్సిడెస్ బెంజ్!

by Vinod kumar |
ఎస్‌యూవీలు పెరిగినా తమ సెడాన్ కార్ల గిరాకీ తగ్గలేదు: మెర్సిడెస్ బెంజ్!
X

న్యూఢిల్లీ: దేశీయ వాహన మార్కెట్లో ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ తమ సెడాన్ కార్ల కోసం ఆదరణ ఇంకా కొనసాగుతోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ అన్నారు. కంపెనీ తన కొత్త జీఎల్‌సీ ఎస్‌యూవీ అమ్మకాలు వేగంగా పెరుగుతున్నప్పటికీ, తమ సెడాన్ కార్లకు గిరాకీ ఏ మాత్రం తగ్గలేదని ఆయన అన్నారు.

ప్రస్తుతం తాము ఎస్‌యూవీ-సెడాన్ విభాగాలను మెరుగ్గా కొనసాగిస్తున్నామని, సెడాన్‌లో ఏ-క్లాస్, బీ-క్లాస్, ఈ-క్లాస్, ఎస్-క్లాస్ మోడళ్లు ఉండగా, ఎస్‌యూవీ విభాగంలో జీఎల్ఏ, జీఎల్‌సీ, జీఎల్ఈ, జీఎల్ఎస్ ద్వారా 48:52 నిష్పత్తిని కలిగి ఉన్నామని సంతోష్ అయ్యర్ వివరించారు. ఇటీవల వచ్చిన జీఎల్‌సీ మొత్తం అమ్మకాల్లో 55-57 శాతం వాటా దక్కించుకున్నప్పటికీ బెంజ్ సెడాన్ కార్ల మార్కెట్ సామర్థ్యం బలంగా ఉంది. ఈ ఏడాది ప్రథమార్థంలో 50 శాతం వాటాకు సమానమైన 8,500 సెడాన్ కార్ల విక్రయం ద్వారా అత్యుత్తం అమ్మకాలను సాధించామని సంతోష్ అయ్యర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed