Video Viral:CPR చేసి పాము ప్రాణాలు కాపాడిన యువకుడు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

by Jakkula Mamatha |   ( Updated:2024-10-18 08:49:14.0  )
Video Viral:CPR చేసి పాము ప్రాణాలు కాపాడిన యువకుడు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది పాములను చూస్తే భయంతో పరుగులు పెడతారు. మరికొందరైతే పాములు కనిపించడంతోనే చంపేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ఓ వ్యక్తి పామును పట్టుకుని దానికి సీపీఆర్ చేశారు. చాలా మంది ప్రాణాపాయంలో ఉన్న వారికి నోటితో సీపీఆర్ ఇచ్చి ప్రాణాలు నిలుపుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. కానీ పాముకు సీపీఆర్ చేసిన ఘటన ఆసక్తికరంగా మారింది.

అసలు విషయంలోకి వెళితే.. గుజరాత్‌ వడోదరలో ఓ వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్న పాముకు సీపీఆర్ చేసి దాని ప్రాణాలు కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బృందావన్ చౌరస్తాలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో ఉన్న పామును గుర్తించిన కొందరు వెంటనే జంతు సంరక్షణ కార్యకర్తలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న బృందం దానికి సీపీఆర్ చేయాలని నిర్ణయించింది. దీంతో యశ్ తాడ్వి అనే యువకుడు నిర్జీవంగా పడి ఉన్న పాము పిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు. దాని ప్రాణాలు పోలేదని నిర్ధారించుకున్న అతను వెంటనే దానికి నోటితో శ్వాస అందిస్తూ సీపీఆర్ చేశాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే పాములో చలనం వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యశ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed