- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SEBI: మాధబి బుచ్‌పై అధికారుల ఫిర్యాదులకు బదులిచ్చిన సెబీ
దిశ, బిజినెస్ బ్యూరో: వరుసగా ఆరోపణలను ఎదుర్కొంటున్న సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పూరి బుచ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే అదానీ గ్రూప్ వ్యవహారంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వేతనం తీసుకుంటున్నారనే విమర్శలు ఎదుర్కొన్న ఆమె, తాజాగా రెగ్యులేటర్ కార్యాలయంలో పనితీరు గురించి సెబీ అధికారులే ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖకు అధికారులు ఫిర్యాదు చేసినట్టు బుధవారం జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పని సమయంలో దూషించడం, అవమానిచడం వంటి పరిస్థితులు ఆఫీసులో ఉన్నాయని, దీనివల్ల మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, బుధవారం సాయంత్రం అధికారుల ఫిర్యాదులపై సెబీ స్పందించింది. సెబీలో పని సంస్కృతిపై ఆరోపణలను తిరస్కరించింది. అవి తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని, ఉద్యోగుల సామర్థ్యాన్ని నీరుగార్చే ప్రయత్నంగా కనిపిస్తోందని సెబీ స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందించ ఈ-మెయిల్ ఫిర్యాదు ఉద్యోగుల సంఘాల పంపలేదని సెబీ పేర్కొంది.