SEBI: ఫిబ్రవరి 1 నుంచి యూపీఐ మెకానిజంను అమలు చేయండి.. స్టాక్‌ బ్రోకర్లకు సెబీ కీలక ఆదేశం..!

by Maddikunta Saikiran |
SEBI: ఫిబ్రవరి 1 నుంచి యూపీఐ మెకానిజంను అమలు చేయండి.. స్టాక్‌ బ్రోకర్లకు సెబీ కీలక ఆదేశం..!
X

దిశ, వెబ్‌డెస్క్: సెకండరీ మార్కెట్(Secondary Market)లో ట్రేడింగ్‌ కోసం ఇన్వెస్టర్లకు యూపీఐ ఆధారిత బ్లాక్‌ మెకానిజం(UPI-Based Block Mechanism) విధానాన్ని లేదా త్రీ-ఇన్‌-వన్‌ ట్రేడింగ్‌(3-in-1 Trading) ఖాతా సదుపాయాన్ని అందించాలని క్వాలిఫైడ్‌ స్టాక్‌ బ్రోకర్లను(QSB) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఆదేశించింది. ప్రస్తుత ట్రేడింగ్‌ విధానంతో పాటు 2025 ఫిబ్రవరి 1 నుంచి ఈ రెండింటిలో ఒక ఫెసిలిటీని తప్పనిసరిగా అమలులోకి తీసుకురావాలని సూచించింది. కాగా ఈ సదుపాయం ఇన్వెస్టర్లకు ప్రస్తుతం ఆప్షనల్(Optional)గా ఉంది. దీంతో స్టాక్ బ్రోకర్లు దీని గురించి చురుకుగా ప్రచారం చేయడం లేదు. కాగా త్రీ-ఇన్‌-వన్‌ ట్రేడింగ్‌ అకౌంటులో డీమ్యాట్‌ అకౌంట్, ట్రేడింగ్‌ అకౌంట్‌, సేవింగ్స్‌ అకౌంట్ మూడూ కలిసి ఉంటాయి. UPI బ్లాక్ మెకానిజంలో క్లయింట్‌లు స్టాక్ బ్రోకర్లకు ముందస్తుగా డబ్బును బదిలీ చేయడానికి బదులుగా తమ బ్యాంకు ఖాతాలలో బ్లాక్ చేసిన నిధుల ఆధారంగా సెకండరీ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేయవచ్చు.

Advertisement

Next Story