మరోసారి స్పెషల్ ఎఫ్‌డీ 'అమృత్ కలశ్' గడువు పొడిగించిన ఎస్‌బీఐ

by S Gopi |
మరోసారి స్పెషల్ ఎఫ్‌డీ అమృత్ కలశ్ గడువు పొడిగించిన ఎస్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం 'అమృత్ కలశ్' గడువును మరోసారి పొడిగించింది. రిటైల్ కస్టమర్లతో పాటు సీనియర్ సిటిజన్‌లకు అధిక వడ్డీని ఆఫర్ చేసే ఈ ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని ఎస్‌బీఐ గతేడాది ప్రారంభించింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన ఈ స్కీమ్ మార్చి 31తో గడువు ముగిసింది. తాజాగా దీన్ని ఈ ఏడాది స్పెటెంబర్ 30 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 400 రోజుల కాలవ్యవధితో ఈ పథకం అందుబాటులో ఉంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టినవారికి అధిక వడ్డీ రాబడి లభిస్తుంది. ఈ ఎఫ్‌డీలో జమ చేసిన సీనియర్ సిటిజన్‌లకు అత్యధికంగా 7.6 శాతం, రిటైల్ కస్టమర్లకు 7.1 శాతం వడ్డీ వస్తుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై మూలం వద్ద పన్ను(టీడీఎస్) వర్తిస్తుంది. ఎస్‌బీఐ బ్రాంచులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ యోనో యాప్ నుంచి కూడా ఈ స్పెషల్ ఎఫ్‌డీలో డిపాజిట్ చేసుకునే వీలుంటుంది. రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. స్వల్ప కాలానికి డిపాజిట్ చేయాలని భావించే వారికి ఈ పథకం ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఈ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లో పెట్టిన దానిపై రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది.

Advertisement

Next Story

Most Viewed