ఎస్‌బీఐతో పేటీఎం భాగస్వామ్యం

by S Gopi |
ఎస్‌బీఐతో పేటీఎం భాగస్వామ్యం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్‌బీఐ ఆంక్షల కారణంగా వేల కోట్ల నష్టాలు చూస్తున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారుల కోసం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే యూపీఐ లావాదేవీలు యథావిధిగా కొనసాగేందుకు యాక్సిస్ బ్యాంకుతో చేతులు కలిపింది. తాజాగా ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్, కార్డు మెషిన్‌ల సేవలు యధాతథంగా కొనసాగనున్నాయి. ఈ మేరకు పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తన నోడల్ అకౌంట్‌ను ఎస్‌బీఐకి బదిలీ చేసిన తర్వాత ఎస్క్రో అకౌంట్ ద్వారా మార్చామని, దీనివల్ల మునుపటిలాగానే తమ వ్యాపార లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది. కేవైసీతో పాటు వివిధ రెగ్యులేట‌రీ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయ‌డంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్‌) విఫ‌ల‌మైంద‌ని ఆర్‌బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో ఫిబ్రవరి 29 నుంచి ఖాతాదారుల నుంచి డిపాజిట్ల సేక‌ర‌ణ‌, క‌స్ట‌మ‌ర్ల‌కు క్రెడిట్ ఫెసిలిటీ, టాప్-అప్, ఫాస్టాగ్ సేవ‌లు, ఇతర స‌ర్వీసులు నిర్వ‌హించొద్ద‌ని పేటీఎంను ఆర్‌బీఅ జనవరి 31న ఆదేశించింది. అనంతరం క‌స్ట‌మ‌ర్ల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని నిషేధాన్ని మార్చి 15 వ‌ర‌కు పెంచిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed