- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోమ్‌లోన్లపై SBI బంపర్ ఆఫర్.. భారీ రాయితీలు..
ముంబై: పండుగ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఇళ్ల రుణాలపై రాయితీలను ప్రకటించింది. దీనికోసం ప్రత్యేకంగా క్యాంపెయిన్‌ను కూడా బ్యాంకు మొదలుపెట్టింది. సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్ కింద ఇళ్ల రుణాలపై గరిష్ఠంగా 65 బేసిస్ పాయింట్ల(0.65 శాతం) వరకు డిస్కౌంట్ లభిస్తుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం బ్యాంకు అందించే ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్లు 9.15 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంది. స్పెషల్ క్యాంపెయిన్ కింద అందిస్తున్న ఆఫర్‌లో భాగంగా 8.6 శాతం నుంచి 9.65 శాతం మధ్య వడ్డీ రేట్లు ఉంటాయని బ్యాంకు పేర్కొంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్నవారు తక్కువ వడ్డీతో రుణాలు పొందవచ్చు. ప్రస్తుతం సిబిల్ స్కోర్ 750-800 మధ్య ఉన్నవారు గరిష్ఠంగా 0.55 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు. దీని ద్వారా 8.60 శాతం వడ్డీతో ఇళ్ల రుణాలు తీసుకోవచ్చు.
అలాగే, 700-749 మధ్య సిబిల్ స్కోర్ ఉన్నవారికి 0.65 శాతం రాయితీ ఉంటుంది. దీంతో 9.35 శాతం వడ్డీకి రుణాలు తీసుకునేవారు ఇకపై 8.70 శాతం వడ్డీకే రుణం పొందవచ్చు. 650-699 పాయింట్ల సిబిల్ స్కోర్ ఉన్నవారు 9.45 శాతంతో, 550-649 పాయింట్ల మధ్య సిబిల్ స్కోర్ కలిగిన వారు 9.65 శాతం వడ్డీకి ఇళ్ల రుణాలు తీసుకోవచ్చు. తక్కువ సిబిల్ స్కోర్‌తో పాటు ఎటువంటి క్రెడిట్ స్కోర్ లేనివారికి కూడా 0.65 శాతం వడ్డీ రాయితీ లభిస్తుందని బ్యాంకు వెల్లడించింది.