- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరేగామా ఇండియా రూ. 750 కోట్ల పెట్టుబడులు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మ్యూజిక్ లేబుల్ కంపెనీ సరెగామా ఇండియా ఆదాయాన్ని పెంచుకునేందుకు రానున్న రోజుల్లో మ్యూజిక్ వ్యాపారంలో రూ. 750 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. భవిష్యత్తులో సంస్థ ఆదాయాన్ని 25-30 శాతం వృద్ధి నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా ఆర్టిస్ట్ పార్‌నర్ కార్యక్రమం ద్వారా నూతన విభాగంలోకి సంస్థ ప్రవేశించనుంది. దీని ద్వారా సంగీతకారుల మ్యూజిక్ వీడియోలు, ఆడియోలను తమ ప్లాట్‌ఫామ్‌లలో లాంచ్ చేసేందుకు వారితో భాగస్వామ్యం చేసుకుంటుంది. కొత్త పెట్టుబడులు కేవలం మ్యూజిక్ వ్యాపారం కోసమే కాకుండా సినిమాలకు, ఇతర వ్యాపార కార్యక్రమాలకు వినియోగించనున్నామని కంపెనీకి చెందిన అధికారి వివరించారు.
మ్యూజిక్ లైసెన్సింగ్, సినిమా వ్యాపారంలో రెండు చోట్ల కలిపి కంపెనీ వచ్చే ఏడాది 25-30 శాతం ఆదాయ వృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కొత్త కార్యక్రమం ద్వారా సరెగామా సంగీతకారులందరికీ తమకు చెందిన కవర్స్, రీమేక్స్, రీక్రియేషన్లను అన్ని భాషల్లోనూ చేసేలా భాగస్వామ్యం చేసుకునేందుకు చర్చించనుంది. కంపెనీ ఈ భాగస్వామ్యాలను మూడు భాగాలుగా కంపెనీ వర్గీకరించింది. మొదటిది డైమండ్ ప్లస్ ద్వారా వచ్చిన రాబడిలో 20 శాతం, రెండు డైమండ్ విభాగంలో వచ్చిన ఆదాయం నుంచి 10 శాతం, కేవలం ఆడియో ద్వారా వచ్చే రాబడి నుంచి 10 శాతం వాటా సంగీతకారులకు ఇవ్వనున్నట్టు అధికారి వెల్లడించారు.