Samsung: సగం ధరకే స్మార్ట్‌ఫోన్ ఆఫర్ చేస్తున్న శాంసంగ్

by S Gopi |
Samsung: సగం ధరకే స్మార్ట్‌ఫోన్ ఆఫర్ చేస్తున్న శాంసంగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ హడావుడి మొదలైంది. ఇప్పటికే ఆన్‌లైన్ సేల్స్ కోసం దిగ్గజ కంపెనీల నుంచి చిన్న ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల వరకు ఆఫర్లను ప్రకటించాయి. తాజాగా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ సైతం పండుగ సీజన్ కోసం భారీ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌పై అధిక తగ్గింపుతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వాటిలో గెలాక్సీ ఎస్, ఎమ్, ఎఫ్ సిరీస్ మోడళ్లను అతి తక్కువ ధరలకు ఆఫర్ చేస్తోంది. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లను సగం ధరకే ఇస్తుండటం విశేషం. కంపెనీ అధికారిక వివరాల ప్రకారం, గెలాక్సీ స్23 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 54,999 ఉండగా, దీన్ని ఏకంగా 50 శాతం మేర డిస్కౌట్‌తో రూ. 27,999కే అందిస్తోంది. ఎస్23పై సైతం 50 శాతం తగ్గింపుతో రూ. 37,999కు, ఎస్23 ఆల్ట్రా రూ. లక్షకు పైగా ఉంటే, పండుగ ఆఫర్ కింద రూ. 69,999కే అందిస్తోంది. అదే విధంగా ఎస్24 ఆల్ట్రా రూ. 1,09,999(15 శాతం తగ్గింపు)కి, ఎస్24 ప్లస్ రూ. 64,999(35 శాతం), ఎస్24 రూ. 59,999(20 శాతం), ఎమ్ సిరీస్‌లో ఎమ్35 5జీ రూ. 13,999(30 శాతం), ఎమ్05తో పాటు ఎఫ్05 రెండూ అత్యల్పంగా రూ. 6,499కే కంపెనీ అందుబాటులో ఉంచింది.

Advertisement

Next Story

Most Viewed