Neo QLED డిస్‌ప్లే, AI లేటెస్ట్ టెక్నాలజీతో శామ్‌సంగ్ స్మార్ట్‌టీవీలు

by Disha Web Desk 17 |
Neo QLED డిస్‌ప్లే, AI లేటెస్ట్ టెక్నాలజీతో శామ్‌సంగ్ స్మార్ట్‌టీవీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ బుధవారం ఇండియా మార్కెట్లోకి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన స్మార్ట్‌టీవీలను విడుదల చేసింది. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వచ్చాయి. అవి నియో QLED 8K, Neo QLED 4K, OLED టీవీలు. వీటిలో QLED 8K మోడల్ 65, 75, 85 అంగుళాల పరిమాణాల్లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.3,19,990. Neo QLED 4K మోడల్ 55, 65, 75, 85, 98 అంగుళాల్లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.139,990. మరో మోడల్ OLED టీవీ 55, 65, 77, 83 పరిమాణాలలో వస్తుంది. ధర రూ.164,990 నుంచి మొదలవుతుంది.


ఈ స్మార్ట్‌టీవీలు స్మార్ట్ ఎకోసిస్టమ్‌తో కనెక్ట్ అయ్యేలా రూపొందించబడ్డాయి. వీటిలో న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU), కొత్త ప్రాసెసర్లను అందించారు. పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంటుంది. శామ్‌సంగ్ క్లౌడ్ గేమింగ్ సేవలు, స్టడీ టూల్స్, స్మార్ట్ యోగా ఫీచర్‌లతో సహా భారతీయ వినియోగదారులకు అనుగుణంగా స్థానికీకరించిన స్మార్ట్ అనుభవాలను అందిస్తుంది.


యూజర్లు సరికొత్త సౌండ్ అనుభూతిని పొందడానికి మెరుగైన స్పీకర్లను అమర్చారు. టీవీ స్క్రీన్‌లు ఇప్పుడు డాష్‌బోర్డ్‌లుగా కూడా ఉపయోగపడుతాయి. ఇవి కెమెరా ఫీడ్‌లు, వాతావరణ అప్‌డేట్‌లు మరిన్నింటిని సులభంగా పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తాయి. కొత్త AI టీవీలు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయని కంపెనీ తెలిపింది. శామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, CEO JB పార్క్ మాట్లాడుతూ, AI శక్తితో నడిచే స్మార్ట్‌టీవీల కొనుగోలుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వారి అంచనాలకు అనుగుణంగా వీటిని అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. ఏప్రిల్ 30, 2024 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లతో పాటు ఉచిత సౌండ్‌బార్లను పొందవచ్చు.

Next Story