సేవ చేసేందుకు వస్తున్నా : ఎంపీ అభ్యర్థి నీలం మధు

by Disha Web Desk 15 |
సేవ చేసేందుకు వస్తున్నా : ఎంపీ అభ్యర్థి నీలం మధు
X

దిశ, సదాశివపేట : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, సీనియర్ నేత పులిమామిడి రాజుతో కలిసి మంగళవారం రాత్రి సదాశివపేట మండలం ఆత్మకూర్ కు ర్యాలీగా చేరుకొని రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా ఆత్మకూర్ కార్నర్ మీటింగ్ లో నీలం మధు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో నేతలు, నాయకులు ఎవరూ లేనట్టుగా ఒక కలెక్టర్ గా పని చేసిన వ్యక్తికి ఎంపీ టికెట్ కేటాయించారని దుయ్యబట్టారు. దీనిని బట్టి బీఆర్ ఎస్ పార్టీ పరిస్థితిని అర్ధం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు

కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చిందని, ఈ సందర్భంగా అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఆత్మకూరులో రైతులు బ్యాంకు లేక ఇబ్బందులు పడుతున్నారని, తాను గెలిచాక ఇక్కడ బ్యాంకు ఏర్పాటుకు బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. మోడల్ స్కూల్, 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తానని స్థానికులకు భరోసా ఇచ్చారు. ఎంపీ ఎన్నికలలో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రామిరెడ్డి ,పార్టీ మండల అధ్యక్షులు సిద్ధన్న పాటిల్,మండల యూత్ ప్రెసిడెంట్ బింబాదర్ చారి, కొండాపూర్ ఎంపీపీ మనోజ్ రెడ్డి,స్థానిక తాజా మాజీ సర్పంచ్ గంగన్న, నాయకులు వెంకన్న, శ్రీనివాస్ గౌడ్, రాము గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed