HYD : గాంధీ ఆస్పత్రిపై తప్పుడు పోస్ట్.. కేసు నమోదు

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-21 02:57:18.0  )
HYD : గాంధీ ఆస్పత్రిపై తప్పుడు పోస్ట్.. కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిపై తప్పుడు పోస్టు పెట్టిన వ్యక్తిపై మంగళవారం కేసు నమోదైంది. ఆసుపత్రిలో విద్యుత్ లేక రోగులు ఇబ్బందులు పడ్డారని ట్విట్టర్‌లో నిందితుడు పోస్టు పెట్టాడు. రోగులు ఇబ్బందులు పడ్డారని ట్విట్టర్‌లో హరీష్ రెడ్డి అనే వ్యక్తి పోస్టు చేశాడు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు ఫిర్యాదుతో పోలీసులు హరీష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆరేళ్ల క్రితం వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story