Samsung: భారత మార్కెట్లోకి కొత్త గెలాక్సీ ఎం06 5జీ, ఎం16 5జీ స్మార్ట్‌ఫోన్లు

by S Gopi |
Samsung: భారత మార్కెట్లోకి కొత్త గెలాక్సీ ఎం06 5జీ, ఎం16 5జీ స్మార్ట్‌ఫోన్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ భారత మార్కెట్లో తన కొత్త ఎం-సిరీస్ మోడళ్లను విడుదల చేసింది. మీడియాటెక్ డైమన్సిటీ 6300 చిప్‌లతో కూడిన గెలాక్సీ ఎం06 5జీ, గెలాక్సీ ఎం16 5జీ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఎం06 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ, 6జీబీలతో కూడిన ర్యామ్‌లతో రెండు వేరియంట్లలో వస్తుండగా, వీటి ధరలు రూ. 9,999, రూ. 11,4999గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. రెండూ 128జీబీ స్టోరేజీతో వస్తాయి. లాంచింగ్ ఆఫర్ కింద ఈ ఫోన్‌ల కొనుగోలుపై రూ. 500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభించనుంది. మార్చి 7 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది. ఇక ఎం16 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ ర్యామ్‌తో కూడిన వేరియంట్ రూ. 12,499, 6జీబీ వేరియంట్ ధర రూ. 13,999, 8జీబీ వేరియంట్ ధర రూ. 15,499గా ఉంది. మూడు వేరియంట్లు 128జీబీ స్టోరేజీతో లభిస్తాయి. లాంచ్ ఆఫర్ కింద రూ. 1,000 క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. ఇవి మార్చి 5 నుంచి అమెజాన్‌లో విక్రయానికి రానున్నాయి. ఫీచర్లకు సంబంధించి 25 వాట్స్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయని, 50ఎంపీ ప్రైమరీ కెమరా, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8ఎంపీ కెమెరాతో వస్తాయని కంపెనీ వెల్లడించింది.

Next Story