- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొట్టమొదటి రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు విడుదల
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కార్ల బ్రాండ్లలో ఒకటైన రోల్స్ రాయిస్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) మోడల్ 'స్పెక్టర్'ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 7.50 కోట్లు(ఎక్స్‌షోరూమ్) నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈవీ మార్కెట్ వేగంగా వృద్ది చెందుతున్న నేపథ్యంలో బ్రిటిష లగ్జరీ కార్ల తయారీ సంస్థ తన మొదటి పూర్తి ఈవీ కారు స్పెక్టర్‌ను తీసుకొచ్చింది. ఈ కారు డ్యుయెల్-మోటార్ సెటప్‌తో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసిన తర్వాత ఇది 520 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అంతేకాకుండా కేవలం 4.5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల స్పీడ్‌ని అందుకోగలదు. భవిష్యత్తులో రోల్స్ రాయిస్ మరింత వేగంగా ఈవీలను మార్కెట్లోకి తీసుకురానుందని, 2030 నాటికి అన్ని సాంప్రదాయ ఇంధన కార్లను తొలగించి ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్టు ప్రకటించింది.