అధిక ప్రీమియమే బీమా కొనుగోలుకు అడ్డంకి: హన్సా రీసెర్చ్!

by Harish |
అధిక ప్రీమియమే బీమా కొనుగోలుకు అడ్డంకి: హన్సా రీసెర్చ్!
X

న్యూఢిల్లీ: జీవిత బీమా ప్రీమియం భారం కావడం వినియోగదారులకు అతిపెద్ద ఆందోళన కలిగిస్తోందని ఓ సర్వే తెలిపింది. దాని తర్వాత బీమా ప్రీమియం చెల్లించడంలో ఆర్థిక స్థోమత కూడా మరింత ముఖ్యమైన సమస్యగా ఉందని ప్రముఖ పరిశోధన సంస్థ హన్సా రీసెర్చ్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వినియోగదారులు జీవిత బీమా కొనుగోలు చేయడంలో అవసరం, ఆర్థిక స్థోమత, కొనుగోలు చేయడంలో ఉండే సమస్యలు వంటి మూడు ప్రధాన అడ్డంకులను ఎదుర్కొంటున్నారు.

దేశవ్యాప్తంగా జీవిత బీమా పాలసీదారుల నుంచి హన్సా రీసెర్చ్ సేకరించిన వివరాల ప్రకారం, 22 శాతం మంది వినియోగదారులు బీమా ఇచ్చిన కంపెనీలు వినియోగదారులకు అందుబాటులో ఉండటం లేదని, అందుకే బీమా నుంచి బయటకు వస్తున్నట్టు చెప్పారు. అలాగే, ప్రతి 10 మందిలో ఎనిమిది మంది కనీసం ఆరు నెలలకు ఒకసారి బీమా కొన్న తర్వాత బ్యాంక్ ఆర్ఎం లేదా ఏజెంట్‌లను కలవాలని కోరుకుంటున్నారు.

అలాగే, బీమాకు సంబంధించి వినియోగదారులు డిజిటల్ విధానానికి ఆసక్తి చూపించడం పెరిగింది. బీమా తీసుకోవడానికి ముందు కంపెనీ వెబ్‌సైట్‌లో సమాచారం, చెల్లింపు వివరాలను తెలుసుకునేందుకు వీలవుతుందని కస్టమర్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed