- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏప్రిల్‌లో 6 శాతం పెరిగిన రిటైల్ అమ్మకాలు!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా రిటైల్ అమ్మకాలు గతేడాది కంటే 6 శాతం సగటుతో వృద్ధి చెందినట్లు రిటైలర్ల సంఘం తెలిపింది. కరోనాకు ముందు నాటి(2019, ఏప్రిల్)తో పోలిస్తే రిటైల్ అమ్మకాలు 23 శాతం, 2021 ఏప్రిల్ కంటే 41 శాతం పెరిగాయి. ఈ ఏడాది ముగిసేలోగా రిటైల్ అమ్మకాల వృద్ధి రెండంకెల స్థాయికి చేరుకుంటుందనే నమ్మకం ఉందని, రానున్న నెలల్లో అమ్మకాలు మరింత పెరుగుతాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) సీఈఓ కుమార్ రాజగోపాలన్ అన్నారు.
ప్రధానంగా దక్షిణాది తో పాటు తూర్పున అమ్మకాలు 7 శాతం చొప్పున పెరిగాయని, పశ్చిమలో 6 శాతం, ఉత్తరాదిలో 3 శాతం వృద్ధి కనిపించిందని ఆర్ఏఐ తెలిపింది. మొత్తం అమ్మకాల్లో క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల అమ్మకాలు 16 శాతం పెరగ్గా, ఆహార, కిరాణా అమ్మకాలు 15 శాతం, ఫర్నిచర్ అండ్ ఫర్నిషింగ్ 14 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు 9 శాతం వృద్ధి సాధించాయని ఆర్ఏఐ వెల్లడించింది.