11.8 శాతం తగ్గిపొయిన రిటైల్ జాబ్ సెర్చ్‌లు

by Harish |   ( Updated:2022-10-08 16:52:16.0  )
11.8 శాతం తగ్గిపొయిన రిటైల్ జాబ్ సెర్చ్‌లు
X

ముంబై: ఆగస్టు 2021 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రిటైల్ ఉద్యోగాల కోసం వెతుకుతున్న భారతీయుల వాటా 11.80 శాతం తగ్గిందని ఓ నివేదిక పేర్కొంది. లాక్‌డౌన్‌లు, పండుగల సమయంలో ప్రజలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపారు. దీంతో ఈ టైంలో రిటైల్ జాబ్ సెర్చ్‌లు అధికంగా నమోదయ్యాయి. రిటైల్ ఉద్యోగాల సెర్చ్‌లు ఆగస్టు 2020 - ఆగస్టు 2021లో 27.70 శాతం పెరిగినప్పటికీ, ఆగస్టు 2021 నుంచి క్రమంగా తగ్గుతు వచ్చిందని గ్లోబల్ జాబ్ సైట్ ఇన్‌డెడ్ నివేదిక పేర్కొంది. రిటైల్ రంగంలో ఉద్యోగాలు గత మూడేళ్లలో (ఆగస్టు 2019 - ఆగస్టు 2022) 5.50 శాతం క్షీణతను చూశాయి.

రిటైల్ సెక్టార్‌లో, బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగాలు అత్యధిక సంఖ్యలో నియామకాలను (22.9 శాతం) కలిగి ఉన్నాయని, అదేవిధంగా.. సేల్స్ అసోసియేట్ స్థాయి ఉద్యోగాలు 10.07 శాతం, స్టోర్ మేనేజర్ 9.52 శాతం, లాజిస్టిక్స్ అసోసియేట్ 4.58 శాతం నియామకాలను కలిగి ఉన్నాయి. ఉద్యోగార్థుల నుండి స్టోర్ మేనేజర్ (15 శాతం), రిటైల్ సేల్స్ అసోసియేట్ (14.4 శాతం), క్యాషియర్ (11 శాతం), బ్రాంచ్ మేనేజర్ (9.49 శాతం) వంటి ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉంది.

నివేదిక ప్రకారం, రిటైల్ రంగంలో దేశీయంగా 12.26 శాతం ఉద్యోగాలలో బెంగళూరు అత్యధిక వాటాను కలిగి ఉంది. ఉద్యోగార్థుల నుండి డిమాండ్ పరంగా, డెలివరీ ఉద్యోగాల కోసం వెతుకుతున్న 6.29 శాతం ఉద్యోగార్ధులతో చెన్నై మొదటి స్థానంలో ఉంది, తరువాత హైదరాబాద్ (5.23 శాతం), కోల్‌కతా (4.85 శాతం) ఉన్నాయి.

డెలివరీ జాబ్‌లకు బెంగళూరులో 5.5 శాతంతో అత్యధిక డిమాండ్ ఉందని నివేదిక పేర్కొంది. దీని తర్వాత చెన్నై (4.92 శాతం), ముంబై (4.16 శాతం), కోల్‌కతా (3.75 శాతం), హైదరాబాద్ (3.27 శాతం) ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

ఐటీలో తగ్గుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకం

22 శాతం పెరిగిన బంధన్ బ్యాంకు రుణాలు, అడ్వాన్సులు

Advertisement

Next Story

Most Viewed