స్వాపింగ్, మల్టీపర్పస్ బ్యాటరీలను ప్రదర్శించిన రిలయన్స్!

by Vinod kumar |
స్వాపింగ్, మల్టీపర్పస్ బ్యాటరీలను ప్రదర్శించిన రిలయన్స్!
X

ముంబై: క్లీన్ ఎనర్జీ రంగంలో మరింత దూకుడు పెంచే దిశగా ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నాలు వేగవంతం చేసింది. బుధవారం జరిగిన పునరుత్పాదక ఇంధన ఎగ్జిబిషన్ కార్యక్రమంలో రిలయన్స్ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల(ఈవె) కోసం స్వాపింగ్, మల్టీపర్పస్ బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీని ప్రదర్శించింది. ఈవీల కోసం రిలయన్స్ రిమూవల్, స్వాల్పింగ్ బ్యాటరీలను ప్రదర్శించింది. ఈ బ్యాటరీలను ఈవీలతో పాటు ఇన్వర్టర్ ద్వారా గృహోపకరణాలకు కూడా ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది.

బ్యాటరీలను రిలయన్స్‌కు చెందిన బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లో మార్చుకోవచ్చు. లేదా రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను ఉపయోగించి రీ-ఛార్జ్ చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్‌లను సైతం తాము విక్రయిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కాగా, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం రిలయన్స్ సుమారు రూ. 83 వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కంపెనీ తన ప్రధాన చమురు-రసాయన వ్యాపారంపై ఆధారపడటాన్ని తగ్గించి, 2035 నాటికి సున్నా కర్బన ఉద్గారాలకు మారాలని లక్ష్యంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed