- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Gold: రాబోయే సంవత్సరాల్లో ప్రధాన పెట్టుబడి సాధనంగా బంగారం: సీఈఏ నాగేశ్వరన్

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా బంగారం ధరలు సరికొత్త రికార్డు స్థాయిలలో పెరుగుతున్నప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో పసిడి ప్రధాన పెట్టుబడి సాధనంగా ఉండనుందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ తెలిపారు. ముఖ్యంగా వివిధ సాధనాలతో పోలిస్తే పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం బంగారం మొదటి ఎంపికగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. బంగారం ఎప్పటిలాగే విలువైన నిల్వగానో, సాంప్రదాయ ఆభరణాలు, ఇతర ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా ముఖ్యంగా పెట్టుబడి సాధనంగా చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. గడిచిన మూడు నెలల్లో బంగారం విలువ కనీసం 8 శాతం పెరిగింది. ఇదే సమయంలో భారత స్టాక్ మార్కెట్లు 8 శాతానికి పైగా క్షీణించాయి. అదే 2002 నాటితో పోలిసే పసిడి విలువ 10 రెట్లకు పైగా పెరిగింది. దీంతో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూల పరిణామాలు ఎదురైనా, బంగారం కొనడం విలువైన పెట్టుబడిగా భావిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఇదే సమయంలో ప్రభుత్వం దేశీయంగా ఉన్న బంగారం ఆస్తులను ఉత్పాదకంగా మార్చేందుకు అవకాశాలను అన్వేషిస్తుందని భావిస్తున్నట్టు నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. దీనికోసం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పునరుద్ధరణపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పథకం ద్వారా కుటుంబాల వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని ఆర్థిక వినియోగంలోకి తీసుకురావొచ్చు. ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో ఉంచి దానిపై వడ్డీ రాబడిని పొందవచ్చు. కాగా, సోమవారం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాములు రూ. 86,620 ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ. 79,400 వద్ద ఉంది.