5 శాతం ఉద్యోగులను తొలగించిన రెడిట్!

by Vinod kumar |
5 శాతం ఉద్యోగులను తొలగించిన రెడిట్!
X

న్యూఢిల్లీ: దేశీయ టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్ కూడా 5 శాతం ఉద్యోగులను తీసేసినట్టు తెలుస్తోంది. దాంతో 90 మంది వరకు ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. ఈ మేరకు లేఆఫ్స్ గురించి కంపెనీ సీఈఓ హవ్‌మన్ ఉద్యోగులకు మెమో ద్వారా తెలియజేశారు. ఈ ఏడాది ప్రథమార్థంలో కంపెనీ పనితీరు, ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి.

ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ ప్రణాళికలను సమీక్షించిన అనంతరం సవాళ్లను అధిగమిస్తామని ఆయన తెలిపారు. పునరుద్ధరణ తర్వాత ద్వితీయార్థంలో కంపెనీ మరింత వృద్ధిని చూడగలదని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో డేటా, ఏపీఐ టూల్స్ కోసం నిధులను సమకూర్చుకోవడంపై దృష్టి సారిస్తామని హవ్‌మన్ అభిప్రాయపడ్డారు. తొలగింపులతో పాటు గతంలో ప్రకటించిన 300 మంది ఉద్యోగుల నియమకాల సంఖ్యను 100కి తగ్గించేసినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed