- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Hyd Housing Sale: ఇళ్ల అమ్మకాలు ఢమాల్.. హైదరాబాద్‌కు ఏమైంది?

దిశ, వెబ్ డెస్క్: Hyd Housing Sale: హైదరాబాద్ లో విక్రయాలు దారుణంగా పడిపోయాయి. 2024లో 5లక్షల యూనిట్ల నుంచి 4.70లక్షల యూనిట్లకు పడిపోయాయి. హైదరాబాద్(Hyderabad) లో అత్యధిక క్షీణత కనిపించింది. ఢిల్లీ(Delhi), ఎన్సీఆర్, నవీ ముంబై(Mumbai) నగరాల్లో మాత్రమే ఇళ్ల అమ్మకాలు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. టాప్ 9 నగరాల్లో హౌసింగ్ సేల్స్(Housing Sale) 9శాతం క్షీణించి 4.7లక్షల యూనిట్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రుతుపవనాల కారణంగా కార్యకలాపాలు రెండు వంతుల తగ్గడంతో 2024లో కొత్త సరఫరాల 15శాతం తగ్గింది. దీంతో 4.11లక్షల యూనిట్లకు పడిపోయిందని ఎన్ఎస్ఈ లిస్టెడ్ రియల్ ఎస్టేట్ డేటా అనలిటికల్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ(Real estate data analytics firm PropEquity) నివేదిక వెల్లడించింది.
2023లో విక్రయించిన యూనిట్ల సంఖ్య 5.14 లక్షలు ఉండగా..2023లో లాంచ్ చేసిన యూనిట్ల సంఖ్య 4.81లక్షలుగా ఉంది. 2024లో 9 నగరాల్లో రెండు నగరాల్లో మాత్రమే ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. నవీ ముంబై(Mumbai) అత్యధిక వ్రుద్ధిని కనబర్చింది. కాగా హైదరాబాద్ అత్యధిక క్షీణతను నమోదు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. 2024లో నవీ ముంబైలో ఇల్ల విక్రయాలు 16శాతం పెరిగి 33,870 యూనిట్లకు చేరుకున్నాయి. ఢిల్లీఎన్సీఆర్ లో ఇళ్ల విక్రయాలు 2024లో 5శాతం పెరిగి 43,923 యూనిట్లకు చేరుకున్నాయి.
బెంగళూరులో(Hyderabad) ఇళ్ల విక్రయాలు 9శాతం క్షీణించి 60,506 యూనిట్లకు పరిమితం అయ్యాయి. చెన్నైలో ఇళ్ల విక్రయాలు 11శాతం క్షీణించి 19, 212 యూనిట్లకు హైదరాబాద్ లో 25శాతం క్షీణించి 61,722 యూనిట్లకు పరిమితం అయ్యాయి. ముంబైలో 6శాతం తగ్గి 50, 140 యూనిట్లకు, పూణేలో 13శాతం తగ్గి 92,643 యూనిట్లకు థానేలో 5శాతం తగ్గి 90, 288 యూనిట్లకు చేరాయి. కోల్ కతాలో ఇళ్ల అమ్మకాలు 2024లో 1 శాతం తగ్గి 18, 595 యూనిట్లకు చేరాయి.
తొమ్మిది నగరాలకు 4 నగరాల్లో కొత్త సరఫరా పెరిగింది. ఢిల్లీ ఎన్సీఆర్ అత్యధిక వ్రుద్ధిని నమోదు చేసింది. హైదరాబాద్ అత్యధిక క్షీణతను నమోదు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఏడాది అమ్మకాల పరంగా హైదరాబాద్ అత్యల్ప పనితీరు కనబరిచింది. ఎన్సీఆర్ లోని నగరాలు ఈ ఏడాదిలో కొత్త సరఫరా, అమ్మకాల్లో మంచి వ్రుద్ధిని సాధించాయని తెలిపారు. బలహీనమైన డిమాండ్ డెవలపర్లను కొత్త ప్రాజెక్టులకు నెమ్మదిగా వెళ్లడానికి ప్రేరేపించి ఉండవచ్చని తెలిపారు.