- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేంద్ర బడ్జెట్ పై ఆర్బీఐ మొదటి సమీక్ష.. యదాతదంగా రెపో రేటు
దిశ, వెబ్ డెస్క్:2024 పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో గెలిచిన ఎన్డీయే కూటమి.. ప్రధాని మోడీ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ పై ఆర్బీఐ మొదటి సమీక్ష నిర్వహించింది. అనంతరం RBI గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన నిర్ణయాన్ని ఆగస్టు 8 ప్రకటించారు. బడ్జెట్ తర్వాత 1వ ద్రవ్య విధానంలో సెంట్రల్ బ్యాంక్ యథాతథ స్థితిని కొనసాగించి.. రెపో రేటును 6.5% వద్ద మార్చకుండా అలానే ఉంచింది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) తన మూడవ ద్వైమాసిక విధాన సమావేశాన్ని 25 ఆర్థిక సంవత్సరానికి ఆగస్టు 6 నుండి ఆగస్టు 8 వరకు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..“స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 6.25 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 6.75 శాతం వద్ద ఉన్నాయి. వృద్ధికి మద్దతునిస్తూ ద్రవ్యోల్బణం క్రమంగా లక్ష్యానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి వసతి ఉపసంహరణపై దృష్టి సారించాలని ఆరుగురిలో నలుగురిలో ఎక్కువ మంది సభ్యులతో MPC నిర్ణయించిందని ఆయన చెప్పుకొచ్చారు.