ప్రభుత్వానికి రూ. 87,416 కోట్ల డివిడెండ్ చెల్లించేందుకు RBI ఆమోదం!

by Harish |
ప్రభుత్వానికి రూ. 87,416 కోట్ల డివిడెండ్ చెల్లించేందుకు RBI ఆమోదం!
X

ముంబై: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వానికి రూ. 87,416 కోట్ల డివిడెండ్ చెల్లించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది. ముంబైలో గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 602 వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావంతో సహా వివిధ సవాళ్ల గురించి సమీక్ష చేపట్టారు. 2022-23 ఏడాదికి మిగులుగా ఉన్న రూ. 87,416 కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు బోర్డు ఆమోదించింది. ఇది అంతకుముందు చెల్లించిన దానికంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.

2021-22లో ఆర్‌బీఐ రూ. 30,307 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ఆకస్మిక అవసరానికి రిస్క్ బఫర్‌గా 6 శాతం నిధులను తమ వద్ద ఉంచుకున్నట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక, ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి 17 శాతం అధిక డివిడెండ్ రూ. 48 వేల కోట్లు ఉంటుందని ఫిబ్రవరిలో ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement

Next Story