97.76% తిరిగొచ్చిన రూ.2000 నోట్లు: RBI

by Harish |
97.76% తిరిగొచ్చిన రూ.2000 నోట్లు: RBI
X

దిశ, బిజినెస్ బ్యూరో: రూ.2000 నోట్ల రద్దు తర్వాత చలామణిలో ఉన్న నోట్లలో ఇప్పటి వరకు 97.76 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చినట్లు మే 2న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక ప్రకటనలో తెలిపింది. మే 19, 2023 న రూ.2000 నోట్ల రద్దు ప్రకటించినప్పుడు చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లుగా కాగా, ఏప్రిల్ 30, 2024 నాటికి వాటి విలువ రూ.7,961 కోట్లకు తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది. అంటే మొత్తంగా 97.76 శాతం తిరిగి వచ్చాయి.

క్లీన్ నోట్ పాలసీలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ రూ.2000 నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు మే 19, 2023 న ప్రకటించింది. నోట్లను మార్చుకోవడానికి పలు దఫాలుగా ప్రజలకు అవకాశం అందించారు. మొదట్లో సెప్టెంబర్ చివరి వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత అక్టోబర్ 9, 2023 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు ముగిసిన తర్వాత నుంచి రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది.

Advertisement

Next Story